జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత హైదరాబాద్‌లో ఇప్పటివరకు రూ. 1.35 కోట్ల నగదును సీజ్ చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
3/ 6
అలాగే రూ. 10 లక్షల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 27 నాన్-బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేశామని 2,698 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయని తెలిపారు.
4/ 6
హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అంజనీకుమార్ పిలుపునిచ్చారు
5/ 6
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నగరంలో తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశామని చెప్పారు.
6/ 6
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు బలమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సూచించారు. ఎన్నికలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.