10. గ్రేటర్ హైదరాబాద్ లోని 150 వార్డుల్లో 74,04,017 మంది ఓటర్లుండగా వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య 35,46,731కాగా 669 మంది ఇతర ఓటర్లున్నారు. 4 జిల్లాల్లోని ఈ 150 వార్డుల్లో 8000 పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వృద్ధులు, క్వారెంటైన్ లో ఉన్నవారు కూడా ఓటు వేసేందుకు అనువుగా ప్రయోగాత్మకంగా ఈ-వోటింగ్ ను అందుబాటులోకి తెస్తుండడం విశేషం. జంట నగరాల్లో (Twin cities) ఎన్నికల సందడి తారాస్థాయికి చేరడంతో ఓటర్ ఐడీ గురించి ఆరా తీసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)