కరోనా విజృంభణతో హైదరాబాద్ నగరంలో చాలామంది అద్దె ఇళ్లను ఖాళీ చేశారు. కరోనా ఉధృతి తగ్గినప్పటికీ.. నగరంలో ఇప్పటికీ చాలా ఇళ్లు అలాగే ఖాళీగా ఉన్నాయి. వాటిని అద్దెకు ఇచ్చేందుకు ఇంటి యజమానాలు ఇబ్బందిపడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ క్రమంలో కొందరు వేరే చోట్ల తమ ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే సమాచారాన్ని పోస్టర్ల ద్వారా వేస్తున్నారు. ఇలా చేసిన వారికి జీహెచ్ఎంసీ జరిమానా విధించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే ఇంటి ముందు టూలెట్ బోర్డులు పెట్టినా జీహెచ్ఎంసీ జరిమానా విధిస్తుందని వార్తలు రావడంతో.. దీనిపై జీహెచ్ఎంసీ క్లారిటీ ఇచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు పోస్టర్లు, కటౌట్లు, వాల్ రైటింగ్‌లకు మాత్రమే జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఎవరింటికి వారు పెట్టుకునే టూలెట్ బోర్టులకు ఫైన్ లేదని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తున్న పోస్టర్లకు మాత్రమే జరిమానా విధిస్తామని వెల్లడించింది.
6/ 6
పబ్లిక్ ప్రదేశాల్లో టూలెట్, కోచింగ్, రియల్ ఎస్టేట్, పాన్‌కార్డ్ చేస్తాం అంటూ వెలసిన ప్రచార పోస్టర్లకు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ(ప్రతీకాత్మక చిత్రం)