Khairatabad Ganesh: 68 ఏళ్లలో తొలిసారి.. ఖైరతాబాద్ పంచముఖ గణనాథుడి ప్రత్యేకతలు ఇవే
Khairatabad Ganesh: 68 ఏళ్లలో తొలిసారి.. ఖైరతాబాద్ పంచముఖ గణనాథుడి ప్రత్యేకతలు ఇవే
Khairatabad Ganesh: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా గణనాథులు కొలువుదీరుతున్నారు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం చాలా ఫేమస్. గణేష్ నవ రాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. మరి ఈసారి ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నేటి నుంచి ఖైరాతాబాద్ భారీ గణనాథుడు పూజలందుకోనున్నాడు. తొలి పూజకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరవుతారు. ఆ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పూజలో పాల్గొంటారు.
2/ 7
ఈసారి 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో భక్తులకు దర్శమివ్వనున్నాడు. కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు దీరారు.
3/ 7
జనాలకు లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేషను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేశారు.
4/ 7
జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు .. 80 రోజుల పాటు పగలూ రాత్రి పని చేసి ఖైరతాబాద్ గణేశుడిని రూపదిద్దారు. ఇందుకు కోటిన్నర వ్యయం అయ్యింది. కరోనా వల్ల గత రెండేళ్లు గణేశ్ వేడుకలు చప్పగా సాగడం..ఈసారి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో.. ఖైరతాబాద్కు భక్తులు క్యూకడుతున్నారు.
5/ 7
1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం మొదలయింది. ఆ తర్వాత ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. 2014లో 60 అడుగుల ఎత్తుతో షష్టి పూర్తి మహాత్సవం జరిపారు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ఈసారి 50 అడుగుల ఎత్తు ఉంది.
6/ 7
లడ్డూ ప్రసాదంలో కూడా ఖైరతాబాద్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కానీ గతంలో ఓసారి లడ్డూ పంపిణిలో జరిగిన తొక్కిసలాట జరగడంతో ఆ సంప్రదాయాన్ని నిలిపివేశారు. ఖైరతాబాద్ గణేష్ చేతిలో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది.
7/ 7
వినాయకుడికి 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువాను ఖైరతాబాద్ పద్మశాలి సంఘం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.