పేరుకు పన్నులు తగ్గించినా, పెట్రోల్, ధరలు మూడు నెలల కిందటి మాదిరే పైస్థాయిలోనే ఉండటం ఒకటైతే, అధిక ధరకు కొందామన్నా పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి తెలంగాణలో చాలా చోట్ల నెలకొంది. ఇంధన కంపెనీలు.. డీలర్లకు ఉద్దెర (క్రెడిట్) పద్ధతి నిలిపివేయడంతో వందల సంఖ్యలో బంకులు మూతపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో.. ముందస్తుగా చెల్లింపులు చేయలేని డీలర్లు పంపులకు నో స్టాక్ బోర్డులు తగిలించేస్తున్నారు. దీంతో పెట్రోల్ కోసం జనం చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
వ్యాప్తంగా 3,400 పెట్రోల్/డీజిల్ బంకులున్నాయి. వీటిలో 15 శాతం అంటే దాదాపు 510 బంకులు ఇప్పటికే నో స్టాక్ బోర్డులతో మూతపడ్డాయి. డబ్బు కట్టి నిల్వ తెచ్చుకున్నపుడు మాత్రమే అమ్మకాలు సాగిస్తూ, వీలుకానప్పుడు మూసేస్తున్న పరిస్థితి. దీనికితోడు కేంద్ర సర్కార్ హఠాత్తుగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో రూ.100 కోట్లు నష్టపోయామని డీలర్లు చెప్పుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. దాని వల్ల కలిగే రూ.1లక్ష కోట్ల నష్టాన్ని కూడా తామే భరిస్తామని చెప్పింది. అయితే, కేంద్రం పన్నులు తగ్గించే సమయానికే అధిక ధరలతో ఆయిల్ కొని స్టాక్ ఉంచుకున్న డీలర్లు ఏకంగా రూ.100 కోట్లు నష్టపోయారు. దీనిని పూడ్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న డిపోల నుంచి ఇంధనం కొనబోమని తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ (టీపీడీఏ) ప్రకటించింది. కేంద్రం దిగిరాకపోతే బంకులనూ బంద్ చేస్తామని చెబుతోంది. అదే జరిగితే వాహనదారుల ఇబ్బందులకు అంతే ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆయిల్ కంపెనీల కఠిన వైఖరి వల్ల ముందస్తుగా పెట్టుబడి పెట్టి సరుకు కొనుగోలు చేయలేక కొందరు, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో రాష్ట్రంలోని అందరు డీలర్లు ఇబ్బంది పడుతున్నట్లు అసోసియేషన్ చెబుతోంది. ఇంధన కంపెనీలు.. మార్చి నుంచి ఉద్దెర విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టి, పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు ముందస్తు చెల్లింపు విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో స్థోమత ఉన్న డీలర్లు మాత్రమే వ్యాపారం నడుపుకొనే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వంటి ఆయిల్ కంపెనీలు ఇప్పటికే ఉద్దెరను నిలిపివేయగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కేవలం 5 రోజుల గడువిస్తోంది. కాగా, ఉద్దెర సమయంలో డీలర్ల నుంచి కంపెనీలు 18 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయని, అసలు, వడ్డీ పేరుకుపోవడంతో దానికీ స్వస్తి చెప్పి బకాయిలను వసూలు చేశాయని, దీంతో డీలర్లు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు అసోసియేషన్ వాదిస్తోంది. మొత్తంగా బంకుల నిర్వహణ గాడి తప్పి ఇప్పటికే 15 శాతం బంకులు మూతపడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ పెట్రోల్ రేట్" width="1600" height="1600" /> ఆయిల్ కంపెనీలకు ముందస్తు చెల్లింపులు చేయలేక తిప్పలు పడుతున్న డీలర్లకు.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం పుండు మీద కారంలా మారిందని, కంపెనీల నుంచి తాము పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసినప్పుడు ఎక్సైజ్ డ్యూటీ చెల్లించామని, రాత్రికి రాత్రే కేంద్ర ప్రభుత్వం డ్యూటీ తగ్గించటంతో సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని డీలర్లు వాపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్రం పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.10 తగ్గించే సమయానికి ఒక బంకులో 20 వేల లీటర్ల డీజిల్, 20 వేల లీటర్ల పెట్రోల్ నిల్వ ఉంటే.. ఆ 40 వేల లీటర్లను తగ్గింపు ధరకే అమ్మాలి. దీంతో డీలరుకు రూ.4 లక్షల నష్టం వచ్చిందని, పైగా వారాంతంలో నిల్వలు అధికంగా ఉన్న సమయంలో డ్యూటీ తగ్గించటంతో భారీగా నష్టపోయామని డీలర్లు చెబుతున్నారు. అదీగాక పెట్రోల్‌కు లీటరుకు రూ.3, డీజిల్‌కు రూ.2 చొప్పున ఇస్తున్న కమీషన్‌ను ఐదేళ్ల నుంచి పెంచలేదనీ వాపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆయిల్ కంపెనీలు మార్కెట్ ఏకఛత్రాధిపత్యాన్ని చూసుకుని వినియోగదారుల ఇక్క ట్లను పట్టించుకోవడం లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో నష్టపోయామంటోన్న డీలర్లు.. ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు భరించాలనే డిమాండ్ తో ఈ నెల 31న కొనుగోళ్లు పూర్తిగా నిలిపేస్తున్నట్లు చెప్పారు. అంటే ఇప్పటికే మూతపడ్డ 15 శాతం బంకులకు బదులు ఈనెల 31న, ఆ తర్వాతి రోజూ తెలంగాణలో మెజార్టీ బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడనుంది. మొత్తంగా ఆయిల్ కంపెనీలు, డీలర్ల మధ్య విభేదాలు వాహనదారులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. దీనికి పరిష్కారం లభించేనా? (ప్రతీకాత్మక చిత్రం)