Ration In Telangana: రేషన్ కార్డుదారులకు నేటి నుంచి బియ్యం పంపిణీ.. ఒకొక్కరికి ఎన్ని కిలోలంటే..
Ration In Telangana: రేషన్ కార్డుదారులకు నేటి నుంచి బియ్యం పంపిణీ.. ఒకొక్కరికి ఎన్ని కిలోలంటే..
Ration In Telangana: రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికి ముఖ్య గమనిక. నేటి నుంచి ఆగస్టు నెల కోటా బియ్యం పంపిణీ చేయనున్నారు. పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఇవ్వనున్నారు. పూర్తి విరాలను తెలుసుకోండి.
ప్రతీ నెల తెలంగాణలో రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రేషన్ కార్డు కలిగిన పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు నెలకు సంబంధించి రేషన్ కోటాను నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
దీనిలో పాత రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున, కొత్త రేషన్ కార్డుదారులకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అలాగే, అంత్యోదయ కార్డులు ఉన్న వినియోగదారులకు మొత్తం 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులు ఉన్నవారికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందనుంది. ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.( (ప్రతీకాత్మక చిత్రం)