అదో ఫంక్షన్ హాల్. అంగరంగ వైభవంగా ఓ పెళ్లి జరుగుతోంది. ఆ ఫంక్షన్ హాల్ కు వస్తున్న వారిని, అక్కడ పార్కింగ్ చేసిన కార్లను చూస్తే చాలు బాగా డబ్బున్న వాళ్ల పెళ్లేనని ఇట్టే తెలిసిపోతుంది. ఆ పెళ్లి వేడుక ముగింపునకు వచ్చిన సమయంలో అనుకోకుండా కలకలం. తన బ్యాగు పోయిందనీ, అందులో భారీగా నగదు ఉందని ఓ బంధువు వాపోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా.. అంటూ పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అచ్చం అలాగే ఓ ఫ్యామిలీ అంతా చోరీలకు పాల్పడుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ ఘడ్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల ప్రశాంత్, 21 ఏళ్ల శ్రావణ్, ఓ మహిళ, ఆరేళ్ల బాలిక అంతా ఒకే కుటుంబ సభ్యులు. వీళ్లందరూ నెల రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. టిప్ టాప్ గా రెడీ అవుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
చూస్తే డబ్బున్నవాళ్లన్న అభిప్రాయాన్ని కలిగించేలా వేషధారణ చేస్తారు. ఓ కారును అద్దెకు తీసుకుంటారు. మైలాన్ దేవ్ పల్లి, రాజేంద్రనగర్ పరిధిలో భారీ సంఖ్యలో ఫంక్షన్ హాల్లు ఉన్నాయన్న విషయాన్ని వాళ్లు తెలుసుకున్నారు. ఆ ఫంక్షన్ హాళ్లల్లో జరిగే వేడుకలకు వీళ్లు కూడా అతిథుల్లా హాజరవుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆరేళ్ల పాపకు బాగా ట్రైనింగ్ ఇచ్చి, ఆ గిఫ్ట్ లను ఒక్కొక్కటిగా ఆ మహిళ వద్దకు చేరవేసేలా ప్లాన్ చేస్తారు. అలా విలువైన వస్తువులను, బంగారపు నగలను చోరీ చేసేస్తారు. మైలాన్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి మూడో వారంలో జరిగిన ఓ శుభకార్యంలో విలువైన వస్తువులతోపాటు భారీగా నగదు ఉంచిన బ్యాగు కూడా మిస్సయింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టేజీపై ఉంచిన బ్యాగు మిస్సవడంతో అక్కడే ఉన్న ఓ కెమెరాను పరిశీలించారు. ఓ పాప ఆ బ్యాగును తీసుకెళ్లడం రికార్డయింది. అన్ని వీడియోలను చెక్ చేస్తే ఆ పాపతో పాటు మరో ఇద్దరు యువకులు, ఓ మహిళ కనిపించారు. వాళ్లంతా ఎవరికీ సంబంధం లేని వారని తెలిసి మైలాన్ దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫంక్షన్ హాల్ రూట్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ నిందితులు ప్రయాణించిన కారును గుర్తించారు. మొత్తానికి వారి వివరాలను ఆరా తీసి రెక్కి నిర్వహించి అందరినీ అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న కారు, నాలుగు మొబైల్స్, 50వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)