ఇక టీకా తీసుకోవడం ద్వార సంభవించే పరిణామాలపై గత ఫిబ్రవరిలో 5 కేసులు, మార్చిలో 27 కేసులను
కమిటీ గుర్తించి అధ్యయనం చేసింది. ఈ క్రమంలో గడిచిన ఏప్రిల్ మాసంలో మొత్తం 10 లక్షల డోసులకు గాను
సరాసరి 2.7 గా మరణాల రేటు నమోదయినట్టు వెల్లడించారు. అంటే ప్రతి పదిలక్షల మందిలో సరాసరిగా
ముగ్గురు వ్యక్తులు టీకా వేసుకోవడం ద్వారా సంభవించే సైడ్ ఎఫెక్ట్స్‌తో చనిపోయారని కమిటీ పేర్కోంది.
ఇక మొత్తం కమిటీ అధ్యయనం చేసిన 31 కేసుల్లో 18 మరణాలు సాధారణ మరణంగా ప్రకటించగా, అంటే టీకా
ద్వారా ఎలాంటీ దుష్ప్రభావాలు సంభవించలేదని పేర్కొన్నారు.వాటిలో మూడు టీకా ఉత్పత్తిలో సంభవించే
మరణాలని స్పష్టం చేశారు. ఇక మరో ఏడు కేసులను అనుమాన స్పద మృతి కేసులుగా తెలిపారు. దీంతో
వాటిపై మరోసారి దర్యాప్తు చేస్తామని ప్రకటించారు.