Telangana Budget: ఇళ్లు లేని నిరుపేదలకు సర్కార్ తీపికబురు..రూ.3 లక్షల ఆర్ధిక సాయం..ఒక్కో నియోజకవర్గంలో ఎంతమందికంటే?
Telangana Budget: ఇళ్లు లేని నిరుపేదలకు సర్కార్ తీపికబురు..రూ.3 లక్షల ఆర్ధిక సాయం..ఒక్కో నియోజకవర్గంలో ఎంతమందికంటే?
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో అభివృద్ధికి, సంక్షేమానికి సమపాళ్లలో నిధులు కేటాయించింది సర్కార్. ఇక రాష్ట్రంలో సొంత జాగా ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

2/ 8
సొంత స్థలం ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ. 3 లక్షలు అందించనున్నట్టు మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుండి 2 వేల చొప్పున లబ్దిదారులకు ఎంపిక చేసి రూ.3 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నారు.
3/ 8
ఇక సీఎం కోటాలో మరో 25 వేల మందికి అదనంగా సాయం అందనుంది. మొత్తం 2.63 లక్షల మందికి రూ.7890 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించనుంది. ఈ మేరకు బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించారు. అయితే ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తుంది.
4/ 8
తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శమని.. దేశంలో తెలంగాణ మోడల్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రూ. 2,90,396 కోట్లతో తెలగాణ బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లుగా ఉంది.
5/ 8
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు(Dalita bandu) పథకానికి రూ. 17,700 కోట్లు కేటాయించారు. ఇక ఆసరా పెన్షన్లకు(Aasara Pensions) రూ. 12,000 కోట్ల కేటాయింపులు జరిపారు.
6/ 8
. రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రుణమాఫీపై ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈసారి రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించింది. అలాగే వ్యవసాయ రంగంతో పాటు రైతుబంధు, రైతుభీమాకు కూడా నిధులు భారీగా కేటాయించింది.
7/ 8
ఈసారి రూ. లక్ష వరకు రుణమాఫీ చేసేలా భారీగా నిధులను కేటాయించింది. కేవలం రుణమాఫీ కోసం ఏకంగా రూ.6385 కోట్లు కేటాయించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.
8/ 8
ఇక బడ్జెట్ ప్రవేశం అనంతరం సమావేశాలను ఎల్లుండికి వాయిదా వేశారు. ఈనెల 8,9,10,11వ తేదీల్లో బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అలాగే ఎల్లుండి అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారుపై BAC సమావేశం ఉండనుంది.