తెలంగాణ వార్తలు, బ్రేకింగ్ న్యూస్, లైవ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, తెలుగు న్యూస్, లైవ్ అప్డేట్స్, జ్వర సర్వే, ఆదిలాబాద్, " width="1280" height="853" /> ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సర్వేలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా జ్వర సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో భాగంగా ఇంట్లోని వ్యక్తులకు జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉన్నాయా లేదా అని తెలుసుకుంటున్నారు.
సాక్షాత్తు ఆయా జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సర్వే తీరును పరిశీలించారు. ఆయా కాలనీల్లోని ప్రజలతో మాట్లాడుతూ వారి ఆరోగ్యం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై ఆరా తీశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సర్వే కోసం సుమారు 1004 బృందాలను ఏర్పాటు చేయగా, జిల్లాలో సుమారు 485 బృందాలను ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో భాగంగా తొలిరోజు సిబ్బంది 29 వేల 977 ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా 706 మంది వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులను గుర్తించి వారికి అవసరమైన మందుల కిట్లను అందజేశారు.
జ్వరంతో ఉన్న వారికి వెంటనే ఐసోలేషన్ కిట్లు అందజేశారు. రెండు డోసులు టీక తీసుకున్నవారు 6 నెలలు కాగానే బూస్టర్ డోసు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. గ్రామంలో ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఇండ్లు సర్వే పూర్తి ఐనది? ఊర్లో ఎవరైనా జ్వరాలు లేదా ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.