హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో దారుణం జరిగింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రి అత్యాచారం చేస్తున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
విషయం తెలుసుకున్న స్థానికులు ఆమె తండ్రిని పట్టుకొని దేహ శుద్ధి చేశారు. అనంతరం డయల్ 100కు సమాచారంబాధ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
కన్నకూతురిపై దారుణానికి ఒడిగట్టిన ఆ నీచుడిని వదిలి పెట్టకూడదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. దిశ, సైదాబాద్ ఘటనల్లో సత్వర న్యాయం జరిగినప్పటికీ.. నేరాలకు అడ్డుకట్ట పడడం లేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. . (ప్రతీకాత్మక చిత్రం)