ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి ఆర్థికమంత్రి హరీశ్ రావు బ్యాంకర్లతో సమావేశమయ్యారు.
6 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ. 2,006 కోట్ల రుణమాఫీ డబ్బులు వేయనున్నట్టు వివరించారు.
రూ. 50 వేల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేయబోతున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయొద్దని సూచించారు.
పూర్తిగా రుణ మాఫీ ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించింది.
రుణ మాఫీ జరిగిన రైతుల అకౌంట్లు జీరో చేసి కొత్తగా రుణాలివ్వాలని మంత్రి హరీశ్ రావు బ్యాంకర్లను కోరారు.
...