ఈమధ్యకాలంలో జిల్లాలోని రైతులు సాగులో కొత్త ప్రయోగాలు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందుతూ మిగిలిన జిల్లాలలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇక్కడి రైతులు సరికొత్త పంటలను పరిచయం చేస్తున్నారు. బ్రకోలి వంటి పాశ్చాత్య దేశాల్లో కనిపించే పంటలను కూడా ఇక్కడ పండించి ఔరా అనిపిస్తున్నారు.
. రైతు కుటుంబాల్లోని చదువుకున్న యువకులు మార్కెట్ కు అనుగుణంగా లాభదాయక పంటల వైపు అడుగులు వేయాలని యువ రైతు మధు పేర్కొంటున్నారు.బరువును తగ్గడం, గుండె సంబంధ వ్యాధులకు నివారణకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆహార నిపుణులు అంటున్నారు. అలాగే మతిమరుపును తగ్గించి మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుందంటున్నారు.