Telangana Rains: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఓ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇందుకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ... ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మరీ మరీ చెబుతూ.... కొనాత్తమ్ దిలీప్ ఓ ట్వీట్ చేశారు. ఆయన తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్. ప్రజలను అప్రమత్తం చెయ్యడంలో భాగంగా ఆయన ఈ ట్వీట్ చేశారు. (image credit - twitter)
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నాయి. ఫలితంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్లో కూడా ఉన్నట్టుండి భారీ వర్షం కురుస్తోంది. దాంతో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఉండనుంది. (image credit - twitter)
ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్స్ ప్రకారం ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాలలో అతి భారీ వర్ష సూచన ఉంది. అలాగే తూర్పున ములుగు జిల్లా, కొమరంభీమ్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. (image credit - twitter)
నిన్న నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో గల జలపాతంలో పర్యాటకులు చిక్కుకున్నారు. ఎగువ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా వరద రావడంతో సుమారు 15 మంది జలపాతం అవతలి వైపున ఉండిపోయారు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. జలపాతంలో చిక్కుకున్న వీడియోను సోషల్ మీడియాలో పర్యాటకులు పోస్ట్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సమీప గ్రామంలోని స్థానికుల సహాయంతో వారిని కాపాడారు. క్షేమంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిర్మల్, బాసర గ్రామాలకు చెందినవారు వాస్తాపూర్ జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. (image credit - twitter)
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం కనికి గ్రామ శివారులొ పిడుగు పడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కౌటాల మండలం ముత్తం పేట్ కనికి శివారులో పొలం పనులు చేసుకుని ఇంటికి తిరిగి ఎడ్ల బండితో వస్తున్న క్రమంలో పిడుగుపడి బార్కుట్ పున్నయ్య (55), దొంగ్రి పద్మ(40), డొంగ్రి శ్వేతా (22) మరిమృతి చెందారు. వీరితోపాటు వ్యవసాయ ఎద్దు కూడా అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ముగ్గురు కూడా కౌటల మండలం ముత్తంపెట్ గ్రామానికి చెందిన వారిగా గ్రామస్థులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్ళి పనులు పూర్తి చేసుకొని వస్తున్న సమయం ఈ ప్రమాదం జరిగింది. (image credit - twitter)