ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఇవాళ కొండల్ తల్లిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు.. కొండల్ తల్లి చెప్పిన మాటలు ఆవేదన కలిగించాయన్నారు. తన కొడుకును చదివించానని, అందుకే చనిపోయాడని.. చదివించకపోయుంటే చనిపోయేవాడు కాదని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతుంటే చూడలేకపోయానన్నారు.