గత పదిరోజులుగా పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్ స్వల్ప ఆస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గంలోని ఎన్నికల నేపథ్యంలోనే ఆయన ఈ నెల 19న పాదయాత్రను ప్రారంభించారు.
2/ 5
కాగా నేడు వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర చేసిన నేపథ్యంలోనే ఆయన జ్వరంతో భాదపడుతున్నట్టు గుర్తించారు.. ఈ క్రమంలోనే మధ్యహ్నమే..పాదయాత్రను ముగించారు.అయితే ఆయన పాదయాత్రను కొనసాగిస్తారా లేక బ్రేక్ వేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.
3/ 5
మరోవైపు ఈటల భార్య జమున పాదయాత్ర చేస్తారనే టాక్ కూడా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆయన జ్వరంతోపాటు కాళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతున్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.
4/ 5
ఈ నేపథ్యంలోనే ప్రతి రోజు సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ... మొత్తం 23 రోజుల పాటు నియోజకవర్గంలోని 120పైగా గ్రామాల్లో చేసేందుకు ఆయన ప్లాన్ చేశారు.
5/ 5
ఈటల అస్వస్థతకు గురైన నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్లో పరామర్శించారు.ఆరోగ్యం మెరుగయ్యోవరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు.