Atm Withdrawal: సాధారణంగా ఏటీఎంలోకి వెళ్లి మనం ఎంత మనీ డ్రా చేయాలనుకుంటామో అంతే కొట్టి తీసుకొని వస్తాం. కానీ వనపర్తి జిల్లాలోని ఓ ఏటీఎంలో రూ.100 కొడితే రూ.500 వచ్చాయి. అసలేం జరిగిందంటే..
వనపర్తి జిల్లాలోని అమరచింతలో ఉన్న ఇండియా నెం.1 ఏటీఎంలో శనివారం ఓ వింత ఘటన చేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఇండియా నెం.1 ఏటీయంలో.. రూ. 100లకు బదులు ఏకంగా రూ.500 డ్రా అయ్యాయి. అలా చేస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
స్థానికులు ఒక్కొక్కరూగా వచ్చి డబ్బులు డ్రా చేసి సంబరాల్లో మునిగిపోయారు. ఈ విషయం ఒకరి నుంచి ఒకరికి ఫోన్ల ద్వారా చెప్పుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఫోన్ చేసి మరీ ఏటీఎం కార్డులు తెప్పించుకున్నారు. డ్రా చేసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ నుంచి కదల్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
మళ్లీ మళ్లీ డ్రా చేసుకుంటూనే ఉన్నారు. అయితే పోలీసులు పెట్రోలింగ్‌కు రావడంతో అక్కడి నుంచి అందరూ పారిపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంటనే సంబంధిత ఏటీయం అధికారులకు సమాచారం ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
వారు వచ్చి ఏటీయంలోని సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేశారు. అధనంగా ఆ ఏటీఎం నుంచి ఎంత డబ్బులు డ్రా అయ్యాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
అంతే కాకుండా ఎవరి అకౌంట్ హోల్డర్ నుంచి డ్రా చేసుకున్నారో వివరాలను తెలుసుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)