దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణంతో.. ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా టీఆర్ఎస్ తరఫున రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కత్తి కార్తీక బరిలో ఉన్నారు.