DOUBLE BED ROOMS WERE INAGURATED BY MIMNISTER KTR AT SIRICILLA VRY
KTR : పేదోళ్ల పక్షపాతి సీఎం కేసీఆర్...డబుల్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
KTR : కేసీఆర్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇచ్చామని అన్నారు. ‘‘పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తుందని అన్నారు...
2/ 4
అనంతరం వాటిని పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నిరుపేదల మొహాల్లో సంతోషం చూడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం లేదని మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు.
3/ 4
త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఇళ్ల శంకుస్థాపన అనంతరం మంత్రి కేటిఆర్ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు.
4/ 4
కార్యక్రమంలో రోడ్డు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్,ఎంపీ సంతోష్కుమార్లతో పాటు స్థానిక నాయకులు పాల్గోన్నారు.