తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కొత్తగా 3లక్షల 9వేల 83 కార్డులను జారీ చేసింది ప్రభుత్వం. లబ్దిదారులందరికీ కొత్త కార్డులను పంపిణీ చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. హైదరాబాద్ బేగంపేటలోని జురాస్టియన్ క్లబ్లో కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు మంత్రి తలసాని. ఆగస్టు నుంచే కొత్త కార్డు దారులందరికీ రేషన్ సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
కుటుంబంలోని ఒక్కొక్కరికీ ఆరు కేజీల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మంత్రి తలసాని అన్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న వారికి కొత్తగా రేషన్ కార్డులు వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న చాలా మందికి రేషన్ కార్డులు రాలేదు. అయితే వారి దరఖాస్తు ఎలా తిరస్కరించారో చాలా మందికి ఇంకా తెలియదు. (ప్రతీకాత్మక చిత్రం)
అంతే కాకుండా తమ గ్రామంలో రేషన్ కార్డు కు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తి ఏ రేషన్ షాప్ పరిధిలోకి వస్తారో కచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. ఈ రేషన్ షాప్ నంబర్ తో మీ దరఖాస్తు స్థితిని సింపుల్ గా తెలుసుకోచ్చు. దీనికి ఏం చేయాలంటే ముందుగా.. google లో telangana Ration cards అని టైప్ చేసి.. నేషన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనే ఆప్షన్ కి వెళ్లాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)