Dharani: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. నేటి నుంచి ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపివేత

Dharani Portal: తెలంగాణలో నిన్నటి నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. మే 12 నుంచి 21 వరకు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాలా కార్యకలాపాలు నిలిచిపోయాయి. కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో ధరణి రిజిస్ట్రేషన్లపైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.