Telangana: జీతాలు పెరిగాయ్.. ఉద్యోగులకు శుభవార్త... డీఏ పెంపు ఉత్తర్వులు జారీ
Telangana: జీతాలు పెరిగాయ్.. ఉద్యోగులకు శుభవార్త... డీఏ పెంపు ఉత్తర్వులు జారీ
DA Hike for Telangana Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏ పెంచుతూ నిన్న తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోగా.. ఇవాళ దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగులో ఉన్న మూడు డీఏల (కరువు భత్యం) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
మూడు డీఏలకు కలిపి 10.01 శాతం చెల్లింపులకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కేబినెట్ నిర్ణయం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన డీఏ (DA hike for telangana employees) 2021 జులై 1 నుంచి వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఈ నెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ (Dearness allowance hike) కూడా ఉద్యోగులకు అందనుంది. డీఏ పెరగడంతో ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. ఇక 2021 జులై నుంచి బకాయిలు జీపీఎఫ్‌లో జమ చేయనుంది ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో రెండేళ్లుగా డీఏల చెల్లింపులో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడడంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకే తెలంగాణ కేబినెట్ ఆమోదించడం.. ఆ మరుసటి రోజే ఉత్తర్వులు వెలువడడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)