ఈ నేపథ్యంలోనే తాను పోలాండ్ దేశంలో పెద్ద వ్యాపార వేత్త కూతురునని, తనను పెళ్లి చేసుకుంటానని
తీయని మాటలతో డాక్టర్ను నమ్మించింది..తాను కూడా ఓ డాక్టర్ అని చెప్పడంతో నగరంలో డాక్టర్ అనందరావు
సైతం ప్రొసిడ్ అయ్యాడు..పైగా ఏమి ఆశించకుండా డబ్బులు అడగకుండా స్నేహం చేస్తుంది కాబట్టి పూర్తిగా
ఆమెను నమ్మాడు.. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక డబ్బులు చేతిలో పడడంతో పోలాండ్ బామ తన ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసింది..మరోవైపు శంషాబాద్
అధికారులమంటూ ఫోన్ చేసినవారి ఫోన్ స్విఛ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన డాక్టర్ అనందరావు సైబర్
క్రైం పోలీసులను ఆశ్రయించాడు..పోలీసులు కేసు బుక్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు...అయితే వలపు వల
పన్ని చాలమంది యువతను సైబర్ క్రైంలోకి లాగుతున్న సంఘటనలు ఇటివల నగరంలో
ఎక్కువయ్యాయి..పోలీసులు హెచ్చరిస్తున్న నగర వాసులు మాత్రం వారి వలలో చిక్కుకునేందుకు సిద్దంగా
ఉంటున్నారు.