Telangana: మండుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు.. ప్రత్యామ్నయం వైపు చూస్తున్న రైతులు..

అసలే వేసవికాలం.. ఆపై మండుతున్న ఎండలు.. పూర్తిగా అడుగంటిపోయిన భూగర్భ జలాలు. వేసవి తాపానికి పొలాలు ఎండిపోతున్నాయి.. పొలాలను కాపాడుకునేందుకు రైతులు పడే కష్టం అంతాఇంతా కాదు... ఇద్దరు అన్నదమ్ములు తమ పొలాన్ని కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా పొలానికి నీటిని పారిస్తున్నారు.