ఇది నిజంగా తెలంగాణ ప్రజలు ఆనందించదగ్గ విషయం. ఒకప్పుడు కరోనాతో చాలా ఇబ్బందులు పడిన తెలంగాణ... ఇప్పుడు అదే కరోనాను చావగొట్టి... "నువ్వు మమ్మల్ని ఏమీ చెయ్యలేవే..." అని బలంగా చెబుతోంది. రోజురోజుకూ రికవరీ రేటు పెరుగుతుంటే... ప్రజల్లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతోంది. తెలంగాణలో గత 24 గంటల్లో 42,299 టెస్టులు చెయ్యడంతో... 1486 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 224,545కి చేరింది. నిన్న కరోనాతో 7గురు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1282కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. దేశంలో అది 1.5 శాతం ఉంది. నిన్న తెలంగాణలో కరోనా నుంచి 1891 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 202,577కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 90.21 శాతానికి చేరింది. దేశంలో అది 88.6 శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 20,686 యాక్టివ్ కేసులున్నాయి. వాటిలో 17,208 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కారణం వాళ్లకు కరోనా లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకప్పుడు కరోనా పేషెంట్లతో నిండిపోయిన ఆస్పత్రులు... ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాయి. (credit - NIAID)