HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES TELANGANA STATE RECORD 316 NEW COVID 19 CASES AND ONLY TWO DEATHS NK
Telangana Covid 19: తెలంగాణలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయి?
Coronavirus updates: తెలంగాణలో కరోనా పరిస్థితి ఎలా ఉందో వివరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజూ కోవిడ్ 19 బులిటెన్ రిలీజ్ చేస్తోంది. దాని వివరాలు మీకోసం.
News18 Telugu | December 21, 2020, 9:42 AM IST
1/ 3
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 316 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. కొత్తగా ఇద్దరు చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1515కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు ప్రస్తుతం 0.53 శాతం ఉంది. దేశంలో అది 1.5 శాతం ఉంది. తెలంగాణలో నిన్న 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,73,625కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 97.12 శాతానికి చేరింది. దేశంలో అది 95.5 శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6590 ఉన్నాయి. వాటిలో 4467 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. (image credit - NIAID)
2/ 3
ఏ విధంగా చూసినా, ఇండియాలో మిగతా చాలా రాష్ట్రాల కంటే తెలంగాణలో కరోనా కంట్రోల్ చాలా బాగుంది. నిన్న ప్రభుత్వం 32,714 టెస్టులు చేసింది. మొత్తం టెస్టుల సంఖ్య 64,75,766కి చేరింది. మరో 554 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో టెస్టుల్లో 93 శాతం దాకా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. తెలంగాణలో ఎక్కువగా 21 నుంచి 50 ఏళ్ల లోపు వారికే కరోనా సోకుతోంది. ఎందుకంటే వాళ్లే తరచుగా ఇళ్లలోంచీ బయటకు పనులపై వెళ్తున్నారు. ఫలితంగా వైరస్ బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు కరోనా ఉన్న వారిలో 70 శాతం మందికి లక్షణాలు కనిపించట్లేదు. (image credit - twitter- reuters)
3/ 3
GHMC పరిధిలో ఒకప్పుడు వందల్లో కొత్త కేసులు వచ్చేవి. మరి నిన్న చూస్తే జస్ట్ 86 మాత్రమే వచ్చాయి. హైదరాబాద్లో కోటి మంది జనాభా ఉంటారు. అలాంటి చోట 86 కేసులు మాత్రమే రావడం గొప్ప విషయమే. జిల్లాల్లోనూ అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలో ఓ 30, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓ 22, కరీంనగర్ జిల్లాలో 18, వరంగల్ అర్బన్ జిల్లాలో 18 కొత్తగా వచ్చాయి. ఒకప్పటితో పోల్చితే ఇవసలు కేసులే కాదనుకోవచ్చు. అలాగని జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమే. ఎందుకంటే ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తోంది. దాన్నుంచి ప్రజలు తప్పించుకోవాల్సిన అవసరం ఉంది.