HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES TELANGANA RECORDS ANOTHER 753 COVID 19 NEW CASES AND THREE NEW DEATHS IN 24 HOURS NK
Telangana Covid 19: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా... ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉందంటే...
Coronavirus updates: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అవ్వడంతో... మళ్లీ కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతోంది ప్రభుత్వం.
News18 Telugu | November 28, 2020, 9:41 AM IST
1/ 4
తెలంగాణ ప్రభుత్వం నిన్న 41,991 కరోనా శాంపిల్ టెస్టులు చేసింది. నిన్న కొత్తగా 753 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,68,418కి చేరింది. అలాగే... నిన్న కొత్తగా ముగ్గురు కరోనాతో చనిపోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1451కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.54 శాతంగా ఉండగా... దేశంలో అది 1.5 శాతంగా ఉంది. (credit - NIAID)
2/ 4
తెలంగాణలో నిన్న 952 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,56,330కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు మరింత పెరిగి 95.49 శాతానికి చేరింది. దేశంలో అది 93.7 శాతంగా ఉంది.
3/ 4
తెలంగాణలో ప్రస్తుతం 10,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 8459 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. తెలంగాణలో నిన్న 41,991 టెస్టులు చేయడంతో... మొత్తం టెస్టుల సంఖ్య 53,74,141కి చేరింది. మరో 695 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.
4/ 4
GHMC పరిధిలో నిన్న 133 కొత్త కరోనా కేసులొచ్చాయి. అలాగే... మేడ్చల్ మల్కాజిగిరిలో 78, రంగారెడ్డి జిల్లాలో 71 వచ్చాయి. మిగతా జిల్లాల్లో 50 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.