తెలంగాణలో కరోనా వైరస్ తగ్గిపోయినట్లు కనిపిస్తున్నా... వాస్తవం ఏంటంటే... అది ఇంకా పోలేదు. ఇప్పటికీ రోజుకు 1500 దాకా కొత్త కేసులు 10 దాకా మరణాలూ సంభవిస్తూనే ఉన్నాయి. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. నిన్న కొత్తగా 1451 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,20,675కి చేరింది. అలాగే... నిన్న 9 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1265కి చేరింది. మరణాల రేటు తెలంగాణలో 0.57 శాతం ఉంది... దేశంలో అది 1.5 శాతం ఉంది. తెలంగాణలో నిన్న 1983 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,96,636కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు మరింత పెరిగి 89.1 శాతానికి చేరింది. దేశంలో అది 87.7 శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,774 ఉన్నాయి. వాటిలో 18,905 కేసుల్లో పేషెంట్లు హోం ఐసోలేషన్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. (credit - NIAID)