ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,027 ఉన్నాయి. వాటిలో 15,205 కేసుల్లో పేషెంట్లు ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిన్న 44,635 టెస్టులు చేసింది. మొత్తం టెస్టుల సంఖ్య 47,29,401కి చేరింది. 555 టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. టెస్టులు పెంచినా... కొత్త కేసుల సంఖ్య తక్కువగానే ఉండటం మంచి పరిణామం.