HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES TELANGANA RECORDS 805 NEW COVID 19 CASES AND 4 DEATHS IN 24 HOURS NK
Telangana Covid 19: తెలంగాణను వదలని కరోనా... మళ్లీ పెరిగిన కొత్త కేసులు
Coronavirus updates: తెలంగాణలో కరోనాను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వైరస్ సవాలు విసురుతోంది. కేసులు మళ్లీ పెరుగుతుండటానికి కారణమేంటి?
News18 Telugu | November 29, 2020, 9:22 AM IST
1/ 4
తెలంగాణలో మొన్న కొత్తగా 753 కరోనా పాజిటివ్ కేసులు రాగా... నిన్న అవి మరింత పెరిగి 805 వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం టెస్టుల సంఖ్య పెంచడమేనని తెలుస్తోంది. టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో... ప్రభుత్వం నిన్న ఏకంగా 46,280 టెస్టులు చేసింది. దాంతో కొత్త కేసులూ పెరిగాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2,69,223కి చేరింది. అలాగే... నిన్న కరోనాతో 4గురు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1455కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. దేశంలో అది 1.5 శాతంగా ఉంది. (credit - NIAID)
2/ 4
తెలంగాణలో నిన్న 948 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,57,278కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 95.56 శాతంగా ఉండగా... ఇండియాలో అది 93.7 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,490 ఉన్నాయి. వాటిలో 8,367 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. (credit - twitter)
3/ 4
తెలంగాణలో ఇప్పటివరకూ 54,20,421 టెస్టులు జరిగాయి. 612 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో చనిపోతున్న వారిలో... కరోనాతో మాత్రమే చనిపోతున్న వారు 44.96 శాతంగా ఉండగా... కరోనాతోపాటూ... ఇతర వ్యాధుల వల్ల చనిపోతున్నవారు 55.04 శాతంగా ఉన్నారు. (credit - twitter)
4/ 4
తెలంగాణ జిల్లాల్లో... కరోనా చాలా వరకూ తగ్గింది. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ రోజువారీ కేసులు ఎక్కువగానే ఉంటున్నాయి. GHMC పరిధిలో నిన్న 131 కొత్త కేసులు వచ్చాయి. అలాగే... జగిత్యాలలో 56, మేడ్చల్ మల్కాజిగిరిలో 82, రంగారెడ్డి జిల్లాలో 58 కొత్త కేసులు వచ్చాయి. మిగతా జిల్లాల్లో 50 కంటే తక్కువే ఉన్నాయి.