HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES TELANGANA RECORDS 394 NEW COVID 19 CASES AND 3 DEATHS IN 24 HOURS NK
Telangana Covid 19: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి. కొత్త కేసులెన్నంటే
Coronavirus updates: తెలంగాణ ప్రభుత్వం కరోనా నుంచి పూర్తిగా బయటపడేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. తాజాగా కేసుల వివరాలు తెలుసుకుందాం.
News18 Telugu | January 3, 2021, 10:17 AM IST
1/ 3
తెలంగాణలో మొన్న 293 కరోనా పాజిటివ్ కేసులు రాగా... నిన్న మరింత పెరిగి... 394 వచ్చాయి. 101 కేసులు పెరిగాయి. ఇది మంచి పరిణామం కాదనుకోవచ్చు. మొత్తం కేసుల సంఖ్య 2,87,502కి చేరింది. తెలంగాణలో మొన్న కరోనాతో ఇద్దరు చనిపోగా... నిన్న ముగ్గురు చనిపోయారు. ఇది కూడా పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1549కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.53 శాతం ఉంది. దేశంలో అది 1.4 శాతం ఉంది. తెలంగాణలో మొన్న 535 మంది కరోనా నుంచి కోలుకోగా... నిన్న 574 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.58 శాతం ఉంది. దేశంలో అది 96.1 శాతం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5388 ఉన్నాయి. వాటిలో 3210 కేసుల్లో ప్రజలు ఇళ్ల దగ్గరే ఉంటూ చికిత్స పొందుతున్నారు. వారికి కరోనా లక్షణాలు కనిపించట్లేదు. (image credit - NIAID)
2/ 3
తెలంగాణ ప్రభుత్వం మొన్న 25,590 టెస్టులు చెయ్యగా... నిన్న 40,190 టెస్టులు చేసింది. టెస్టులు పెరగడం వల్ల పాజిటివ్ కేసులు కూడా పెరిగాయి. ఈ లెక్కన టెస్టులు తక్కువగా చేసినప్పుడల్లా... ఎంతో కొంత మందికి కరోనా ఉన్నా... వారు లెక్కల్లోకి రావట్లేదని అనుకోవచ్చు. అలాగని అదేపనిగా టెస్టులు చేయడం కూడా ఆర్థిక భారమే. కాబట్టి... అనుమానం ఉన్న వారికి టెస్టులు చేస్తున్నారు. తెలంగాణలోని ఆరుచోట్ల నిన్న వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించిన ప్రభుత్వం... వ్యాక్సిన్ల వాడకానికి అనుమతి లభించగానే... డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. (image credit - twitter - reuters)
3/ 3
GHMC పరిధిలో, జిల్లాల్లో కరోనా కేసులు చాలా వరకూ తగ్గినా... ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఓ పది మందికి ఉన్నా... వారి ద్వారా ఇతరులకు అది వ్యాపించగలదు కాబట్టి... ప్రజలు అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ ఉంటేనే ఈ కరోనాకి చెక్ పెట్టగలమని ప్రభుత్వం చెబుతోంది.