ఇక తెలంగాణలో నిన్న 2103 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 1,85,128కి చేరింది. రికవరీ రేటు తెలంగాణలో 87.29 శాతం ఉంటే... దేశంలో అది 85.9 శాతంగా ఉంది. అంటే దేశంలో కంటే తెలంగాణలో కరోనా మెరుగ్గా కంట్రోల్ అవుతోందనే అర్థం. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 25,713 ఉన్నాయి. వీటిలో 21,209 కేసుల్లో ప్రజలు ఇళ్ల దగ్గరే ఉంటూ నయం చేసుకుంటున్నారు. తెలంగాణలో నిన్న 46,657 టెస్టులు చెయ్యగా... మొత్తం టెస్టుల సంఖ్య 35,47,051కి చేరింది. 1093 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.