ఇదివరకైతే... మెట్రో స్టేషన్ ప్లాట్ఫాం దగ్గరకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల్ని అనుమతించేవారు. ఇప్పుడు అలా కాదు. కొద్ది మంది చొప్పున పంపిస్తారు. తద్వారా... రైళ్లలో రద్దీ లేకుండా చేయబోతున్నారు. ఇదివరకు ఒక్కో మెట్రోరైల్లే వెయ్యి మంది దాకా ప్రయాణించేవారు. ఇప్పుడు చాలా తక్కువ మందినే అనుమతిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.