HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES COVID 19 TESTS CROSS 35 LAKH MARK IN TELANGANA NEW CASES 1811 RECORDED NK
Telangana Covid 19: తెలంగాణలో 35 లక్షలు దాటిన కరోనా టెస్టులు... కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి
Coronavirus updates: తెలంగాణలో కరోనా మరణాలు తక్కువగానే ఉండొచ్చు. అంత మాత్రాన కరోనా వ్యాప్తి కొనసాగితే ఎలా? బ్రేక్ పడేదెప్పుడు?
News18 Telugu | October 10, 2020, 9:55 AM IST
1/ 4
తెలంగాణలో రోజు 2వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్త కేసుల సంఖ్య 2వేల దాకా వస్తూనే ఉంది గానీ... తగ్గట్లేదు. ఇలా ఎన్నాళ్లు అన్న ప్రశ్నకు వ్యాక్సిన్ వచ్చే వరకూ అనే సమాధానం వస్తోంది. తెలంగాణలో నిన్న కొత్తగా 1811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,10,346కి చేరింది. అలాగే... నిన్న 9 మంది చనిపోవడంతో... మొత్తం కరోనా మరణాల సంఖ్య 1217కి పెరిగింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.57 శాతంగా ఉండగా... దేశంలో అది 1.5 శాతంగా ఉంది. (credit - NIAID)
2/ 4
తెలంగాణలో నిన్న 2072 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 183,025కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 87.01 శాతంగా ఉండగా... దేశంలో అది... 85.7 శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 26104 ఉండగా... వాటిలో 21551 మందికి కరోనా లక్షణాలు పెద్దగా లేవు. వారిని ఇంటి దగ్గరే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
3/ 4
తెలంగాణలో నిన్న కొత్తగా 50469 టెస్టులు చేశారు. అందువల్ల మొత్తం టెస్టుల సంఖ్య 35లక్షల 394కి పెరిగింది. మరో 1236 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో... కరోనా వల్ల మాత్రమే చనిపోతున్న వారు 44.96 శాతం ఉండగా... ఇతర వ్యాధులతోపాటూ... కరోనా వల్ల చనిపోతున్న వారు 55.04 శాతం ఉన్నారు. తెలంగాణలో 21-40 ఏళ్ల వయస్సు వారికి కరోనా ఎక్కువగా సోకుతోంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో వీరి సంఖ్య 47 శాతం ఉంది.
4/ 4
తెలంగాణ జిల్లాల్లో 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇవీ