తెలంగాణలో నిన్న కొత్త కేసుల కంటే రికవరీలు కొద్దిగా ఎక్కువ రావడం మంచి విషయం. కొత్తగా వచ్చిన రికవరీల సంఖ్య 1481గా ఉండగా... మొత్తం రికవరీల సంఖ్య 2,29,064కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 91.5 శాతంగా ఉండగా... ఇండియాలో అది 92.4 శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 19,890 ఉన్నాయి. వీటిలో 17,135 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు.