HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES COVID 19 NEW CASES INCREASE IN TELANGANA AND HYDERABAD TOO NK
Telangana Covid 19: హైదరాబాద్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... కంట్రోల్ తప్పుతోందా?
Coronavirus updates: తెలంగాణలో కరోనా తగ్గిపోయినట్లే అనుకునే పరిస్థితులు కనిపించట్లేదు. ఓ 40వేల టెస్టులు చేస్తే గ్యారెంటీగా... 14వందలకు పైగా కేసులొస్తున్నాయి.
News18 Telugu | October 31, 2020, 9:24 AM IST
1/ 3
తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు కరోనా విషయంలో మళ్లీ అలర్టుగా ఉండాల్సిన సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే... హైదరాబాద్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నిన్న 41,243 టెస్టులు చెయ్యగా... మొత్తం 1445 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,38,632కి చేరింది. అలాగే... నిన్న ఆరుగురు కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1336కి చేరింది. నిన్న కొత్తగా 1486 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,18,887గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 18,409 ఉన్నాయి. వీటిలో 15,439 కేసుల్లో పేషెంట్లు ఇళ్లదగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. (credit - NIAID)
2/ 3
తెలంగాణ ప్రభుత్వం నిన్న 41,243 టెస్టులు చెయ్యడంతో... మొత్తం టెస్టుల సంఖ్య 42,81,991కి చేరింది. మరో 914 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 21 నుంచి 60 ఏళ్ల లోపు వారికి కరోనా ఎక్కువగా సోకుతోంది. మొత్తం కేసుల్లో వీరు 76 శాతం ఉన్నారు. అలాగే కరోనా వల్ల చనిపోతున్న వారిలో... కరోనా మాత్రమే ఉండి చనిపోతున్న వారు 44.96 శాతం కాగా... కరోనాతోపాటూ... ఇతర వ్యాధులూ ఉండి చనిపోతున్న వారు 55.04 శాతం ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా సోకిన ప్రతి 200 మందిలో ఒకరు చనిపోతున్నారు. అలాగే తెలంగాణలో రికవరీ రేటు 91.72 శాతం ఉండగా... దేశంలో అది 91.3 శాతంగా ఉంది.
3/ 3
జిల్లాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ GHMC పరిధిలో నిన్న 286 పాజిటివ్ కేసులొచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 122, నల్గొండ జిల్లాలో 102, రంగారెడ్డి జిల్లాలో 107 వచ్చాయి. మరో 4 జిల్లాల్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.