తెలంగాణలో రికవరీ కేసులు నిన్న 1896 వచ్చాయి. మొత్తం రికవరీ కేసులు 2,00,686కి చేరాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరింత పెరిగి 89.96 శాతానికి చేరింది. దేశంలో అది 88.2 శాతానికి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 21,098 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 17,432 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒకప్పుడు కరోనా వస్తే... కచ్చితంగా ఆస్పత్రికి తీసుకుపోయేవాళ్లు... ఇప్పుడు మాత్రం... లక్షణాలు లేకపోతే... ఇళ్లలోనే ఉండి, ట్రీట్మెంట్ తీసుకోమంటున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో మొత్తం టెస్టుల సంఖ్య 38,56,530కి చేరింది. 1050 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. ఇప్పటివరకూ తెలంగాణలో కరోనా 21 నుంచి 40 ఏళ్ల మధ్యవారికి ఎక్కువగా సోకుతోంది. ఎందుకంటే వాళ్లే రకరకాల పనులపై ఎక్కువగా బయట తిరుగుతున్నారు.