కొత్తగా 24 గంటల్లో ఆరుగురు మాత్రమే కరోనాతో చనిపోయారు. ఇదివరకు రోజూ 10 మంది దాకా చనిపోయేవాళ్లు. మొత్తం మరణాల సంఖ్య 1228కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.57 శాతం ఉంది. దేశంలో అది 1.5 శాతం ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. తెలంగాణలో నిన్న 2214 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,87,342కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 86.2 శాతంగా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకూ 35,77,261 టెస్టులు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 20,036 మందికి కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉండటంతో... వాళ్లను ఇళ్లలోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.