HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES 10 DISTRICTS IN TELANGANA STILL HAVING MORE COVID 19 POSITIVE CASES DAILY NK
India Covid 19: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... ఆ 10 జిల్లాల్లోనే ఎక్కువగా వ్యాప్తి
Coronavirus updates: తెలంగాణ ప్రభుత్వం ఓ 50 వేల దాకా టెస్టులు చేస్తే... దాదాపు 2000 దాకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉంది.
News18 Telugu | October 13, 2020, 10:03 AM IST
1/ 4
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గిందా లేదా అన్నది కరెక్టుగా తేలట్లేదు. ప్రభుత్వం రోజువారీ కరోనా బులిటెన్ రిలీజ్ చేస్తోంది. అందులో... టెస్టుల సంఖ్య 30వేల దాకా ఉంటే... కరోనా కేసులు 1000 నుంచి 1300 దాకా నమోదవుతున్నాయి. అదే ప్రభుత్వం 50వేల దాకా టెస్టులు చేస్తే... కరోనా కేసులు 1700 నుంచి 2000 దాకా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి 2 నెలల నుంచి వుంది. మొత్తంగా చూస్తే కొత్త కేసుల జోరు ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే అని లెక్కలు హెచ్చరిస్తున్నాయి. (credit - NIAID)
2/ 4
తెలంగాణలో కొత్తగా 1708 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,14,792 ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 24,208 ఉంటే... వాటిలో 19,748 కేసుల్లో పేషెంట్లు ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఎందుకంటే వాళ్లకు కరోనా ఉన్నా దాదాపు లేనట్లే ఉంది. లక్షణాలే లేవు. కరోనా వల్ల నిన్న తెలంగాణలో 5 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1233కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. నిన్న తెలంగాణలో 2009 రికవరీలు వచ్చాయి. మొత్తం రికవరీల రేటు 1,89,351కి చేరింది. తెలంగాణలో రికవరీల రేటు 86.8 శాతంగా ఉంది.
3/ 4
తెలంగాణలో నిన్న 46,835 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 36,24,096కి చేరింది. 1034 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో కరోనా సోకిన వారిలో ప్రస్తుతం 70 శాతం మంది అసింప్టమేటిక్గా కరోనా లక్షణాలు లేకుండా ఉంటున్నారు. 30 శాతం మందికే లక్షణాలు కనిపిస్తున్నాయి.
4/ 4
జిల్లాల్లో GHMCలో కరోనా కేసులు తగ్గాయి కానీ... ఇప్పటికీ రోజూ 300 లోపు వస్తూనే ఉన్నాయి. నిన్న 277 కొత్త కేసులు వచ్చాయి. అలాగే... మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ అర్బన్, సిద్ధిపేట, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటికీ కొద్దిగా ఎక్కువగానే కేసులొస్తున్నాయి.