CORONA SPREADING FASTER IN TELANGANA STATE THAT TOTAL 3877 CASES REGISTERED IN JUST 24 HOURS SPAN AND GHMC REGISTERED HIGHEST CASES PRV
Corona cases in Telangana: తెలంగాణలో తగ్గని కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో 3,877 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. ఓ వైపు ఫీవర్ సర్వేలు, మరోవైపు వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఇతర రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నా.. గత కొద్దిరోజులుగా కేసులు మాత్రం మూడు వేలకు పైగానే వస్తున్నాయి.
తెలంగాణలో కరోనా (Corona cases in Telangana) వ్యాప్తి మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,877 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు.
2/ 8
ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Corona cases in Telangana) 7,54,976 కాగా, మరణాల సంఖ్య 4,083గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,10,479 ఉండగా, తాజాగా 2,981 మంది కోలుకున్నారు.
3/ 8
రాష్ట్రంలో రికవరీ రేటు 94.11 శాతం ఉంది. ఇక ఐసోలేషన్లో 40,414 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
4/ 8
ఇక, ఇవాళ మొత్తం 1,01,812 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు వ్యాప్తంగా ఇప్పటివరకు 3,18,77830 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
5/ 8
మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో (Corona cases in Telangana) అత్యధికంగా గ్రేటర్ పరిధిలో 1189 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో మేడ్చెల్ జిల్లాలో 348 మంది, రంగారెడ్డి జిల్లాలో 241 మంది, హన్మకొండ జిల్లాలో 140 కేసులు నమోదయ్యాయి.
6/ 8
జిల్లాలో 112 కేసులు, జిల్లాలో 107 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కరోనా కేసులు వెలుగు చూశాయి.
7/ 8
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. విద్యాసంస్థల ప్రారంభంపై (Telangana Schools and Colleges:) వివరాలు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.(ప్రతీకాత్మక చిత్రం)