తెలంగాణలో కరోనా (Corona cases in Telangana) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో 1,920 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 83,153 శాంపిల్స్ టెస్ట్ చేశారు. 1920 కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. కరోనా కారణంగా 2 మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,045కి చేరింది.