తెలంగాణలో కరోనా (Corona cases in Telangana) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 95,355 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 3,590 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (Corona cases in Telangana) 7,58,566కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది.
మెదక్ 47, మేడ్చల్ మల్కాజిగిరి 257, ములుగు 22, నాగర్ కర్నూల్ 45, నల్గగొండ 98, నారాయణపేట 26, నిర్మల్ 47, నిజామాబాద్ 67, పెద్దపల్లి 63, సిరిసిల్ల 41, రంగారెడ్డి 215, సిద్దిపేట 115, సంగారెడ్డి 118, సూర్యాపేట 98, వికారాబాద్ 53, వనపర్తి 53, వరంగల్ రూరల్ 45, హనుమకొండ 132 యాదాద్రి భువనగిరిలో 78 చొప్పున కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి (Schools Re open). రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి (Education Minister) (Sabita Indra reddy) వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.