తెలంగాణలో ఒమిక్రాన్ (Omicron) కోరలు చాస్తోంది. గత రెండు వారాలుగా కరోనా కేసుల (Corona cases in Telangana) ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గత 13 రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య తొమ్మిది రెట్లు పెరిగాయి. అంతేకాకుండా యాక్టివ్ కోవిడ్ కేసులు ఆరు రెట్లు పెరిగాయంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రోజువారీ కేసుల పెరుగుదల కారణంగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
జనవరి 12 నాటికి, రాష్ట్రంలో కోవిడ్ రోగుల కోసం ప్రభుత్వం సిద్ధం చేసిన మొత్తం 1338 ఆసుపత్రులు (Hospitals) ఉన్నాయి. వాటిలో 112 ప్రభుత్వ ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులలో, కోవిడ్ రోగుల కోసం 56,038 బెడ్లు ఉన్నాయి. మొత్తం పడకలలో, 1673 ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించబడ్డాయి. 1673 మంది రోగులలో, 564 మంది సాధారణ పడకలు కేటాయించారు.
654 మంది ఆక్సిజన్ సపోర్టుతో, 455 మంది ఐసీయూలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ సారి భారీగా కేసుల నమోదు ఉన్నా ఆస్పతుల్లో భారీగా చేరికలు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినప్పటికే కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని మూడో వేవ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)