Corona cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం.. గత 24 గంటల్లో కోవిడ్ కేసులు ఎన్ని వచ్చాయంటే..
Corona cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం.. గత 24 గంటల్లో కోవిడ్ కేసులు ఎన్ని వచ్చాయంటే..
తెలంగాణలో జనవరిలో కరోనా వ్యాప్తి పెరిగింది. దీంతో ఓ వైపు ఫీవర్ సర్వేలు, మరోవైపు వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఇతర రాష్ట్రాల కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.
తెలంగాణలో కరోనా కేసులు (Corona cases in Telangana) క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,714 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 683 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
2/ 9
దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య (Corona cases in Telangana) 7,83,019కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరణాలు సంభవించలేదు.
3/ 9
కోవిడ్ నుంచి నిన్న 2,645 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 13,674 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 168 కేసులు నమోదయ్యాయి.
4/ 9
ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,066 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 896 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 6 మంది మరణించారు.
5/ 9
రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,694కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 8,849 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,72,881 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
6/ 9
ఏపీలో 24,454 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల(Covid positive Cases) సంఖ్య 23,12,029కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,28,09,000 నిర్థారణ పరీక్షలు చేశారు.
7/ 9
భారత్‌లో రోజురోజుకు కరోనా(Corona) కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో 50,407 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రోజువారీ పాజిటివటీ రేటు కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది.
8/ 9
గత 24 గంటల్లో 804 కరోనా కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 97.37 శాతం రికవరీ రేటుతో 1,36,962 మంది కోవిడ్-19(Covid-19) వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,10,443గా ఉన్నాయి.
9/ 9
ఇది ఇప్పటివరకు మొత్తం కేసులలో 1.43 శాతం. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడానికి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, దేశంలో దాదాపు 172.29 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పూర్తయ్యాయి