Coriander leaves: కొండెక్కిన కొత్తిమీర.. భారీగా పెరిగిన ధరలు.. చిన్న కట్టకు రూ.50
Coriander leaves: కొండెక్కిన కొత్తిమీర.. భారీగా పెరిగిన ధరలు.. చిన్న కట్టకు రూ.50
Coriander leaves: ఆదివారం వచ్చిందంటే దాదాపు అందరి ఇళ్లల్లో మాంసాహర వండుకుంటారు. చికెన, మటన్‌తో సండేను మరింత స్పెషల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఐతే కోడి, మేక కూరల్లో ఖచ్చితంగా వేసుకునే ఐటమ్ కొత్తిమీర. కానీ ఇప్పుడు కొత్తమీర లేకుండానే చికెన్, మటన్ వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కొత్తమీర లేకుండా కోడికూర చేసుకునే రోజులు వచ్చాయి. మార్కెట్లో కొత్తిమీర ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
కొత్తిమీర సరఫరా తగ్గడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో కొత్తిమీర ధరలు పెరిగాయి. ఇవాళ ఆదివారం కావడంతో మరింత ఎగబాకాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం మార్కెట్లకు కర్నాటక నుంచి కొత్తిమీర సరఫరా అవుతుంది. కానీ అధిక వర్షాల వల్ల కర్నాటకలో కొత్తిమీర పంట దిగుబడి తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
వర్షాల వల్ల కొత్తిమీర పంట దెబ్బతినడంతో... తక్కువ మొత్తంలోనే రాష్ట్రానికి వస్తోంది. దాని కోసం వ్యాపారులు ఎగబడడంతో రేట్లు అమాంతం పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
సాధారణంగా కిలో కొత్తిమీర ధర రూ.80 నుంచి 100 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.400కి పెరిగింది. డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడం వల్ల ధరలు ఎగబాకాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్రజలు కిలోల లెక్కన కొత్తిమీరను కొనరు. ఏదో ఒక కట్టో రెండు కట్టలో తీసుకుంటారు. ఐతే రూ.10 పలికే చిన్న కొత్తిమీర కొట్ట.. ఇప్పుడు రూ.50కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
మళ్లీ కొత్తిమీర సాగు పెరిగి.. సరఫరా పెరిగితేనే.. ధరలు తగ్గుతాయి. అప్పటి వరకు అధిక ధరలకే కొత్తిమీర లభిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)