Cooking Oil: పండగల సీజన్లో సామాన్యులకు షాక్.. భారీగా పెరుగుతున్న వంటనూనె ధరలు
Cooking Oil: పండగల సీజన్లో సామాన్యులకు షాక్.. భారీగా పెరుగుతున్న వంటనూనె ధరలు
Cooking Oil Price: వంట నూనెల ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గతంలో భారీగా పెరిగిన నూనెల రేట్లు.. ఈ మధ్యే తగ్గాయి. అంతలోనే మళ్లీ పెరుగుతున్నాయి.
పండగ సీజన్లో ముందు వంట నూనెలు షాకిస్తున్నాయి. రోజు రోజు రేట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మళ్లీ పెరగడంతో.. ఆ ప్రభావం వంట నూనెలపై పడుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఈ నెల 1న విజయ బ్రాండ్ పొద్దుతిరుగుడు వంటనూనె ధర రూ.138 ఉంటే.. ఇప్పుడు దాని రేటును రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (ఆయిల్‌ఫెడ్) రూ.155కు పెంచేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
పొద్దుతిరుగుడు నూనె ధర పెరగడం వల్ల.. దాని ప్రభావం ఇతర వంటనూనెలపైనా పడుతోంది. పామాయిల్ ధర రెండు నెలలుగా పడిపోతుండగా.. ఇప్పుడు ఒక్కసారిగా రూ.10 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే దసరా ముగిసింది. దీపావళి కూడా వస్తోంది. ఈ నెలాఖరు నుంచి కార్తీక మాసం కూడా మొదవుతున్న నేపథ్యంలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఐతే వంట నూనెలకు డిమాండ్‌కు క్యాష్ చేసుకునేందుకు.. కొందరు వ్యాపారులు రష్యా యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
పొద్దుతిరుగుడు, వేరుశనగ నూనెల ధరలు అధికంగా ఉండటంతో పామాయిల్ విక్రయాలు బాగా పెరిగాయి. పామాయిల్ ధర లీటరుకు రూ.100లో పే ఉండటంతో హోటళ్లు, శుభకార్యాలయాల్లో దీనికి డిమాండ్ పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
డిమాండ్ పెరగడం వల్ల పామాయిల్ ధర కూడా రూ.10 వరకు పెరిగింది.ఇండోనేసియా నుంచి పామాయిల్ దిగుమతులు వస్తుండటంతో ధర కాస్త అదుపులో ఉంది. లేదంటే వీటి ధరలు కూడా మరింత పెరిగేది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం, పప్పులు, పాల ధరలతో పాటు ఇప్పుడు నూనె ధరలు కూడా పెరగడంతో.. సామాన్యులపై మరింత భారం పడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)