హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైలు, హైదరాబాద్ ముంబై బుల్లెట్ రైలు" width="1200" height="800" /> దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. ఈ వారమే ఇండియా రానున్న జపాన్ ప్రధాని ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్టుపై మన ప్రధాని మోదీతో చర్చిస్తారు. మరోవైపు ముంబై-నాగపూర్ ప్రాజెక్టు రిపోర్టు రైల్వే బోర్డుకు చేరింది. ప్రతిపాదనలో ఉన్న ఇతర ప్రాజెక్టుల్లోనూ వేగం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి..(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీ-తెలంగాణ మధ్య కనెక్టివిటీని పెంచాలన్న విభజన చట్టంలోని హామీ ఎనిమిదేళ్లయినా నిరవేరలేదు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పట్టాలెక్కనున్న దరిమిలా, అంతకంటే లాభసాటి మార్గం ఇదేనంటూ ‘హైదరాబాద్-విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్’ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. (ప్రతీకాత్మక చిత్రం)
ఏపీ విభజన చట్టంలో తెలంగాణలోని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేస్తూ, దేశంలో కొత్తగా వందేభారత్ రైళ్లు నడుపుతామని చెబుుతున్న దరిమిలా వాటి తయారీ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేసే అంశాన్నికేంద్ర ఆలోచించాలని, పీపీపీ విధానంలో వెళ్లినా పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నాని ఉత్తమ్ చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. అహ్మదాబాద్-ముంబై రూటు కంటే లాభదాయకంగా ఉంటుందని, ఇందుకోసం తెలంగాణలోని చిట్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట మీదుగా కొత్త లైన్ వేస్తే రెండు నగరాల మధ్య ప్రయాణం రెండు గంటలు తగ్గుతుందని, వెంటనే దీనిపై అధ్యయనం చేయాలని కేంద్రాన్ని ఉత్తమ్ కోరారు.(ప్రతీకాత్మక చిత్రం)
దేశీయ రైల్వేల మొత్తం రాబడిలో దక్షిణ మధ్య రైల్వేకి 60 శాతం వాటా ఉన్నప్పటికీ పట్ల కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని, కాజీపేటలో కోచ్ఫ్యాక్టరీని, కాజీపేట రైల్వే డివిజన్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దారుణమని ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు.(ప్రతీకాత్మక చిత్రం)