రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannnadh) దర్శకత్వంలో కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ (Liger). అనన్యపాండే హీరోయిన్గా నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. Photo : Twitter
తాజాగా లైగర్ సినిమా చుట్టూ రాజకీయాలు నెలకొంటున్నాయి. సినీ నిర్మాణంలో అక్రమ పెట్టుబడులు పెడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత లైగర్ సినిమాలో పెట్టుబడి పెట్టారని జడ్సన్ ఆరోపించారు.
లైగర్ సినిమాలో కవిత పెట్టుబడి పెట్టరనటానికి తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని, విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈడీని కోరారు. దీంతో ఇప్పుడు ఈ వార్త అటు రాజకీయాలతో పాటు. ఇటు సిని వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. 'లైగర్' సినిమాకు కథానాయిక ఛార్మి, బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ మాత్రమే నిర్మాతలుగా వ్యవహరించారు. MLC Kavitha - File Photo
అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కవిత పెట్టుబడి పెట్టిందంటూ ఫిర్యాదుల చేయడం వెనక ఈ సినిమాపై ఇంకా ఎంతమంది పెట్టుబడి పెట్టివుంటారనే విషయమై ఈడీ దృష్టిసారించిందని జడ్సన్ తెలిపారు. ఒకవేళ ఈడీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటే కొందరు పారిశ్రామికవేత్తల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)