Telangana College Fee Hike: తెలంగాణలోని స్టూడెంట్స్, పేరెంట్స్ కు షాక్.. పెరగనున్న ఫీజులు.. వివరాలివే
Telangana College Fee Hike: తెలంగాణలోని స్టూడెంట్స్, పేరెంట్స్ కు షాక్.. పెరగనున్న ఫీజులు.. వివరాలివే
తెలంగాణ(Telangana)లో వచ్చే ఏడాది నుంచి కాలేజీ ఫీజులు(College Fees) పెరగనున్నాయి. ఈ మేరకు వారంలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని విద్యార్థులు, తల్లిండ్రులకు వచ్చే ఏడాది నుంచి ఫీజుల పెంపు షాక్ తగలనుంది. వృత్తి, విద్య కాలేజీలకు కొత్త ఫీజులు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
వృత్తి, విద్యా కాలేజీలకు మూడేళ్లకు ఓ సారి కొత్త ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నిర్ణయిస్తుంది. మూడేళ్లకు ఓ సారి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కమిటీ ఫీజుల్లో మార్పులు చేస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
చివరిసారిగా 2019-20లో కమిటీ నిర్ణయించిన కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. అయితే.. ఈ గడువు 2021-22 విద్యా సంవత్సరంతో ముగియనుంది. దీంతో వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
దీంతో తాజాగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్ర, TAFRC చైర్మన్ జస్టీస్ స్వరూప్ రెడ్డి తదితరులు నిన్న సమావేశమై చర్చించారు. మరో వారం రోజుల్లో కొత్త ఫీజులకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో ఫీజులు పెద్దగా పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. చివరిసారి 2020లో 20 శాతం వరకు ఫీజులను పెంచారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
కొన్ని కాలేజీల్లో ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించిన ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో బీటెక్ కోర్సుకు సంబంధించి అత్యధిక ఫీజు 1.34 లక్షలు ఉండగా.. అత్యల్పంగా రూ. 35 వేలుగా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అయితే.. ఇప్పటి వరకు రెండేళ్లలో కాలేజీల ఆదాయం, ఖర్చు తదితర వివరాల ఆధారంగా ఫీజులకు ఖరారే చేసేవారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి మాత్రం ఒకే ఏడాది 2019-20 ఆదాయం, వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)