Cm Kcr: నేడు ఆ 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..రైతులకు భరోసాగా..
Cm Kcr: నేడు ఆ 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..రైతులకు భరోసాగా..
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు అన్నదాతలకు గుండెకోతను మిగిల్చాయి. వడగండ్ల వానలు పంటలను పూర్తిగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ నేడు ఆ 4 జిల్లాల్లో పర్యటించనున్నారు.
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు అన్నదాతలకు గుండెకోతను మిగిల్చాయి. వడగండ్ల వానలు పంటలను పూర్తిగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ నేడు ఆ 4 జిల్లాల్లో పర్యటించనున్నారు.
2/ 7
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో..ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గురువారం నాడు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతులను కలిసి పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు.
3/ 7
ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. సీఎం పర్యటనతో ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
4/ 7
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే పంట నష్టం గురించి నివేదికను సిద్ధం చేశారు. అయితే నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అందించనున్నట్టు సమాచారం.
5/ 7
ఈ పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో కురిసిన వర్షాలకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతులతో సీఎం సమీక్షించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
6/ 7
కేసీఆర్ పర్యటనతో ఆయా జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్ల పనులను పరిశిలీస్తున్నారు.
7/ 7
సీఎం పర్యటన నేపథ్యంలో పంట నష్టం నివేదికలు సిద్ధం చేయాలనీ..తిరుగు ప్రయాణం వరకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశించారు.